విశ్వ హిందూ పరిషత్ కార్య విభాగాలు - కార్యపద్ధతి
బజరంగ్ దళ్:
“సేవ,సురక్ష,సంస్కార్” వీటీ ద్వార హిందూ యువకులను ధర్మము పట్ల, దేశ రక్షణ పట్ల క్రియాశీలం చెయ్యడం. బలోపాసన కేంద్రం, సాప్తాహిక్ మిలన్ల ద్వారా సమాజ సురక్ష కోసం బలశాలురు,సుశిక్షితులు,దేశభక్తులు,అనుశాసనం గల హిందూ యువకులను తీర్చిదిద్ది,సంస్కార యుక్త, నిషాముక్త, దుర్వ్యసన రహిత యువతను నిర్మాణంచేయడం. “సరిహద్దుల రక్షణకు… సైన్యం! సమాజంలో శాంతిభద్రతల రక్షణకు… పోలీస్!! హిందూ ధర్మ రక్షణకు… సంస్కారబద్ధ పోరాటంచేసే సైన్యం…. బజరంగ్ దళ్ !!!”
దుర్గా వాహిని:
యువతులలో శారీరిక, మానసిక దృఢత్వం పెంచడం, వారిలో దేశభక్తి, దైవభక్తి పెంచడం, లవ్ జిహాద్ బారిన వారు పడకుండా కాపాడుకోవడం. ఇందుకోసం శిక్షణా తరగతులు ఏర్పాటు చేయటం, శక్తి సాధనా కేంద్రాల నిర్వహణ చేయడం, సాప్తాహిక్ మిలన్ ఏర్పాటు, ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి, దుర్గాష్టమి నాడు ఆయుధ పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తుంది.
మాతృ శక్తి:
“మాత – సమాజ నిర్మాత” అని భావిస్తాం.సమాజంలో ధర్మాన్ని రక్షించడంలో, ధార్మిక సంస్కారాన్ని అందించడంలో మాతృమూర్తుల పాత్ర చాలా ముఖ్యమైనది. ‘మహిళలు అబలలు కాదు సబలలు’– మహిళా సాధికారత, మహిళా నేతృత్వం, సమాజ అభివృద్ధి, దృఢీకరణలో మహిళల భాగస్వామ్యం పెంచుట. దుర్గాష్టమి, సామూహిక కుంకుమ పూజలు, వరలక్ష్మీ వ్రతాలు, సీతానవమి వంటి కార్యక్రమాల నిర్వహణ.
“తల్లి ఒడి తొలి బడి” – బాల సంస్కార కేంద్రాల నిర్వహణ.
సత్సంగం:
దైవ భక్తితో పాటు దేశభక్తి వుంటేనే దేశము,ధర్మము రక్షింపబడతాయి, హిందూసమాజ మనుగడ వుంటుంది. హిందూ నమాజ కార్యము విజయవంతం చేయడానికి అవసరమైన నిత్యసిద్ధ శక్తిని నిర్మించడంలోనూ, కార్యకర్తల తయారీకి, చైతన్య శీల, జాగృత హిందూ తయారీకి ముఖ్య భూమిక. సత్సంగము వున్నచోట, అక్కడి హిందూ సమాజం ముందు వున్న అన్ని సవాళ్లు మరియు ఇతర అంతర్గత సమస్యలన్నీ సహజంగా పరిష్కారమవుతాయి.
విశేష సంవర్క:
ప్రముఖులను, ధార్మిక సంస్థల నిర్వాహకులను,ప్రభుత్వ అధికారులను, ప్రజా ప్రతినిధులను, ధార్మిక చింతన కలవారిని, ఆర్ధిక సహకారం అందించే దాతలను నిరంతరం సంపర్కం చేస్తూ హిందూ ధర్మ రక్షణకు వారిని భాగస్వామ్యం చేయటం.
సంస్కార విభాగం:
బాలబాలికలకు బాల సంస్కార కేంద్రాలు, సంస్కార శాలల నిర్వహణ. రామాయణం, మహాభారతం, జాతీయ నాయకుల జీవితాలలోని జీవన మూల్యాలపైన పరీక్షలు, భగవద్గీత కంఠస్థ సంస్కార్ పోటీలు నిర్వహణ చేయడం.
సామాజిక సమరసత విభాగము:
‘అస్పృశ్యత’ అనేది మానసికమైన సామాజిక వికృతి, ఇది చట్టం ద్వారా లేదా రాజకీయ అధికారం ద్వారా తొలగించలేని సామాజిక రుగ్మత. ఏకాత్మత తత్త్వదర్శనాలను హిందూసమాజ జీవనంలో ఆచరణలోకి తీసుకు రావడం. హిందూ సమాజంలోని ప్రతి వ్యక్తి ఆలోచనా విధానాన్ని మార్చడం ద్వారా దోషరహితమైన సమరసత సమాజాన్ని నిర్మించడం.
సేవా విభాగము:
VHP వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రత్యేకంగా ప్రతి గ్రామం వరకు సేవా కార్య విస్తరణ లక్ష్యంగా పనిచేస్తున్నది. తద్వారా ఆజీవన పర్యంతం తప్పనిసరి అవసరాలైన విద్య, వైద్యం, సామాజిక, స్వావలంబన అనే నాలుగు రకాలైన సేవా కార్యక్రమాలు చేస్తుంది.
గోరక్ష విభాగము:
గోవులు కబేళాలకు పోకుండా ఆపడం,గోసంరక్షణ, గోపోషణ, గోఆధారిత వ్యవసాయం, గోఉత్పత్తుల ప్రోత్సాహం. ఖర్చుముక్త కిసాన్, యువతకు ఉపాధి, స్వస్థ భారత (ఆరోగ్య భారత్), సంవృద్ధ భారత్. గోంక్ష రాష్ట్రీయ ప్రాణిగా ప్రకటించి, గోవంశ స్వతంత్ర మంత్రిత్వ శాఖ ఏర్పాటుచేయాలి, గోచర భూమిని రక్షించాలి.
ప్రచార ప్రసార విభాగము:
ప్రచార ప్రసార ద్వారా వాస్తవ చరిత్ర,సైద్ధాంతిక విషయాలు, సమకాలీన సమస్యలు వివరాల పుస్తకాలు, కరపత్రాలు ముద్రణ, పంపిణీ చేయడం. సోషల్ మీడియా ట్విట్టర్, ఫేస్బుక్, అవెబ్సైట్ ద్వారా ధర్మ ప్రచారం, ఆంధ్ర ప్రదేశ్ లో “విశ్వ ధర్మ వాణి” మాసపత్రిక ద్వారా అధ్యాత్మిక, సామాజిక, జాతీయ భావాలు ప్రచారం చేయడం.
ధర్మ ప్రసార విభాగము :
మతమార్పిడులకు గురి అవుతున్న హిందువులను రక్షించి, మతం మారినవారికి అవగాహన కల్పించి తిరిగి హిందూ ధర్మంలోనికి తీసుకొని రావడమే ‘పరావర్తనము’. ఈ ధర్మ ప్రసార కార్యాన్ని ప్రభావవంతముగా మరియు ప్రసా వేగవంతముగా చేయడం, సమాజానికి అవగాహన కల్పించడం. “పరావర్తనం అంటే – మతమార్పిడి కాదు, దారి తప్పిపోయినవారిని వెనక్కి తెచ్చుకోవడమే!”
లీగల్ సెల్:
దేవాలయ ఆస్తుల రక్షణకు, మతమార్పిడుల సమస్యలు, ప్రభుత్వ స్థలాలను ఇతరమతాలవారు ఆక్రమణలు అడ్డుకోవడంలోను, ఇతర మతస్తుల దాడులు, గో అక్రమ రవాణా నిరోధ సమస్యలు, ప్రభుత్వం ఏర్పాటు చేసే చట్టాల పరిశీలన, హిందూ వ్యతిరేక ప్రభుత్వ కార్యకలాపాలపై న్యాయపరమైన పోరాటం కోసం, పేద హిందువులకు న్యాయ సహకారంకోసం ప్రతి కోర్టు పరిధిలోను హిందూ న్యాయ వాదుల విభాగం ఏర్పాటు.
ధర్మాచార్య సంవర్క విభాగము:
స్వామీజీలను నిరంతరం సంపర్కంచేసి ధర్మ ప్రచారంలో వారి మార్గదర్శనం పొందడం.
మందిర అర్చక పురోహిత విభాగము:
హిందూ ధార్మిక వ్యవస్థలో మందిరము, అర్చకులు మరియు పురోహితులు అనే మూడు రకాల వ్యవస్థలు ప్రభావంతమైన విభాగాలు.
మందిరము సామాజిక వికాస కేంద్రంగా, ధర్మ పరిరక్షణా కేంద్రంగా వ్యవస్థీకృతం చేయటం.
సంస్కృత విభాగము:
సంస్కృతంలో ఉన్న మంత్రాలు, శ్లోకాలు అర్థమయ్యేలా తెలుగులో ప్రచారం చేయడం, సంస్కృత భాషని నేర్పించడం, ప్రచారం చేయడం, వేద పాఠశాలలు నిర్వహణ.
ధర్మయాత్రా విభాగము:
ధార్మిక క్షేత్రాలలో సంప్రదాయ బద్ధంగా జరిగే యాత్రలు నిర్వహణ చేయడం, యాత్రికులకు సేవలు అందించడం. ధార్మిక ,యాత్రలలో, జాతర్లలో, ఉత్సవాలలో భక్తులకు, యాత్రికులకు సౌకర్యాలు ఏర్పాటు జరిగేటట్లు చూడటం, అవసరమైన ఆరోగ్య, ఆహారం సేవలు చేయడం, క్రమబద్ధీకరించటం, సంవేదనశీల క్షేత్రాలలోవున్న ధార్మిక స్థలాల రక్షణ, వాటి పట్ల శ్రద్ధ జాగరణ చేయడం.