విశ్వ హిందూ పరిషత్ - సాధించిన విజయాలు

అయోధ్య శ్రీరామ జన్మభూమి రక్షణ వంటి అనేక ఉద్యమాలు ద్వారా హిందూవుల్లో స్వాభిమానాన్ని పెంపొందించి, విజయం సాధించి, అయోధ్య రామ జన్మభూమిలో భవ్య, దివ్య శ్రీరామ మందిర నిర్మాణాన్ని పూర్తిచేయుట.
శ్రీరామ సేతువు ధ్వంసం కాకుండా పోరాటం
తిరుమల తిరుపతి ఏడుకొండల పరిరక్షణ ఉద్యమాలను విజయవంతం చేయడం.
అమరనాథ్ యాత్రికుల సౌకర్యం కొరకు 100 ఎకరాల భూమిని హిందూ సమాజమునకు తిరిగి ఇప్పించుట.
కాశ్మీరులో స్థానిక హిందువుల రక్షణ కోసం పోరాటం.
సుమారుగా 70 లక్షల మంది మతాంతీకరణ నుండి కాపాడబడ్డారు. మతం మారిన 8 లక్షల మందిని తిరిగి స్వధర్మంలోకి తీసుకొనిరాబడ్డారు.
30వేల మందికి పైగా మహిళలు లవ్ జిహాద్ నుండి రక్షింపబడ్డారు.
దేశంలో విశ్వ హిందూ పరిషత్ ద్వారా 125 విద్యార్థి వసతి గృహాలు, 1220 ఆరోగ్య కేంద్రాలు, 45 అనాథ శరణాలయాలు నిర్వహించబడుతున్నాయి.
లక్షలాది గోవులను వధశాలలకు వెళ్ళకుండా రక్షించబడ్డాయి.

విశ్వ హిందూ పరిషత్ - ఆశయాలు

*  హిందూ సమాజాన్ని సుసంఘటితము, సుదృఢము, శక్తివంతమైన సమాజంగా తీర్చిదిద్దుట.

*  భారతీయ నైతిక, ఆధ్యాత్మిక జీవన మూల్యములను వికసింపజేయుట, ప్రచారం చేయుట, పరిరక్షించుట.

*  హిందూ ధర్మము, సమాజము, సంస్కృతులపై జరుగుతున్న ప్రత్యక్ష, పరోక్ష దాడుల నుండి సంరక్షించుటకు హిందువులలో స్వాభిమానాన్ని జాగృతం చేయుట.

*  కులము, వర్గము, భాష, ప్రాంతము, సంప్రదాయము వగైరా విభేదములకు అతీతమైన సామరస్య హిందూ సమాజాన్ని నిర్మించుట.

*  గోవు, గోవంశ సంరక్షణ.

*  హరిజన, గిరిజన, బడుగు వర్గాల సమగ్ర వికాసానికి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టుట.

*  విదేశాలలో నివసించే హిందువులలో హిందూ ధర్మము, సంస్కృతి, సంప్రదాయాల వికాసానికి వివిధ కార్యక్రమాలు చేపట్టుట.